వీరబల్లి (ప్రజా సీమ)
ఐపీఎల్ ప్రారంభం నేపథ్యంలో వీరబల్లి ఎస్సై సుస్మిత యువతకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. క్రికెట్‌ను వినోదంగా మాత్రమే ఆస్వాదించాలే గానీ, బెట్టింగుల మోజులో పడకూడదని సూచించారు. ఇటీవల యువత బెట్టింగుల వల్ల ఆర్థికంగా, మానసికంగా నష్టపోతూ జీవితాలను కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. అలాంటి ప్రమాదకర అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు.
ఎవరైనా క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వీరబల్లి ప్రాంతంలో బెట్టింగులపై ప్రత్యేక నిఘా ఉంచామని, ఎవరైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. యువత తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సరైన మార్గంలో నడవాలని ఈ సందర్భంగా వీరబలి ఎస్సై సుస్మిత సూచించారు.

