పెనగలూరు (ప్రజాసీమ)
రైల్వేకోడూరు నియోజకవర్గం, పెనగలూరు మండల టిడిపి కార్యాలయం నందు మండల పార్టీ అధ్యక్షుడు ఎంజర్ల నారాయణరెడ్డి అద్వర్యం లో 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యనిర్వాహన కార్యదర్శి కస్తూరి విశ్వనాధ నాయుడు రాష్ట్ర ఖాదీ బోర్డు చైర్మన్ కేకే చౌదరి ప్రముఖ పారిశ్రామికవేత్త విశ్వేశ్వర్ నాయుడు రాష్ట్ర సాంస్కృతిక అధ్యక్షుడు పంతగాని నరసింహ ప్రసాద్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అజయ్ బాబు జెండా అవిస్కరణ చేశారు అనంతరం మండల పార్టీ అధ్యక్షుడు ఎంజర్ల నారాయణరెడ్డి మట్లడుతు.ఎన్టీఆర్, చంద్రబాబులతోనే తెలుగు రాష్ట్రాలలో ప్రగతి.
ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ముందుకు సాగుతాం
.తెలుగుదేశం ఆవిర్భావంతోనే వెలుగు బీజం పడిందని, 1982లో 44 ఏళ్ల క్రితం ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీకి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. మహనీయుల ఆశయాలు దశాబ్దాలు గడుస్తున్నా నెరవేరకపోవడంతో ఆ బాధ్యతను తన భుజాన వేసుకొని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని వెల్లడించారు. సంపద అందరికీ అందాలీ.. ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదు.. అన్న ఉద్దేశంతో అధికారంలోకి వస్తూనే రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి నిరుపేదల ఆకలి తీర్చారని గుర్తు చేశారు. అప్పటిదాకా ఉన్న పట్వారి, పటేల్ వ్యవస్థలను శాశ్వతంగా నిర్మూలించి మండల వ్యవస్థను తీసుకువచ్చారని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరికి విద్య అందాల అన్న ఉద్దేశంతో గురుకులాలు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఆయన హయాంలో వెనకబడిన వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత జనతా వస్త్రాలు, పక్కా గృహాల నిర్మాణాల వంటి ఎన్నో కార్యక్రమాలకు తెలుగుదేశం ప్రాణం పోసిందని అన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రాంప్రసాద్,ప్రధాన కార్యదర్శి p.రవి,క్లస్టర్ ఇంచార్జ్1 నాగేశ్వర్ నాయుడు, క్లస్టర్ ఇంచార్జ్ 2 p.సుబ్రహ్మణ్యం మరియు టిడిపి సీనియర్ నాయకులు కార్యకర్తలు
అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

