ePaper
Monday, April 6, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్నాగవరంలో పసుపు జెండా రెపరెప; తెలుగుదేశం జెండాలు ఎగరవేసిన పంతగాని నరసింహ ప్రసాద్

నాగవరంలో పసుపు జెండా రెపరెప; తెలుగుదేశం జెండాలు ఎగరవేసిన పంతగాని నరసింహ ప్రసాద్

📰 Generate e-Paper Clip

చిట్వేలి (ప్రజా సీమ)

తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలం నాగవరం గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం కి వచ్చినరాష్ట్ర ఖాదీ బోర్డు చైర్మన్ కేకే చౌదరి కి,రాష్ట్ర కార్యనిర్రోహక కార్యదర్శి  కస్తూరి విశ్వనాధ నాయుడు కి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మాచినేని విశ్వేశ్వర్ నాయుడు కి మరియు తెలుగుదేశం పార్టీ మండల కమిటీ నాయకులకు,గ్రామ కమిటీ నాయకులు,తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు టీడీపీ రాష్ట్ర సంస్కృతిక విభాగ అధ్యక్షులు శ్రీ పంతగాని నరసింహ ప్రసాద్ హృదయపూర్వక స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసి పంతగాని మాట్లాడుతూ తెలుగుజాతి ఆత్మగౌరవానికి 44 సంవత్సరాలు అయ్యిందని, ఈ పసుపు జెండా ఎగరకపోయి ఉంటే నేటికీ ఢిల్లీ పెద్దల చేతుల్లో కీలు బొమ్మల తెలుగు ప్రజలు ఉండేవారని, నటనతో ప్రేక్షకులను, రాజకీయంతో అణగారిన వర్గాలను అలరించిన ఒకే ఒక్క నాయకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు అని, ఆయన అడుగుజాడల్లో చంద్రబాబు సారధ్యంలో తెలుగు ప్రజలకు ఆత్మ గౌరవానికి ప్రతికగా నిలిచేలా తెలుగుదేశం పార్టీ నిలుస్తుందని నాకు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!