ePaper
Monday, April 6, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్రాష్ట్ర డైరెక్టర్ వీరభద్రుడు చేతుల మీదుగా డయాగ్నస్టిక్ సేవలు ప్రారంభం

రాష్ట్ర డైరెక్టర్ వీరభద్రుడు చేతుల మీదుగా డయాగ్నస్టిక్ సేవలు ప్రారంభం

📰 Generate e-Paper Clip

సిద్ధవటం-(ప్రజా సీమ)

రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం మాధవరం-1 గ్రామ పంచాయతీలోని పార్వతీపురం గ్రామంలో శ్రీ అవ్వారు శ్రీను, మహాలక్ష్మి దంపతుల ఆహ్వానం మేరకు చి.అవ్వారు శ్రీహరి నూతనంగా ప్రారంభించుతున్న *శ్రీ మహాలక్ష్మి డయాగ్నస్టిక్స్* ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈరోజు ఉదయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నూర్ భాషా దూదేకుల కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ నాగూరు వీరభద్రుడు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిరంజీవి శ్రీహరికి ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉండాలని, సేవే మార్గంగా ముందుకు పోతూ మంచి పేరు ప్రఖ్యాతులు అనతి కాలంలోనే సంపాదించుకోవాలని, వారి తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆశీర్వదించారు. అదేవిధంగా మాధవరం వన్ గ్రామం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నదని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇక్కడ కలుగుతున్న సదుపాయాలను ఉపయోగించుకోవాలని వారు కోరుకున్నారు.ఈ కార్యక్రమానికి స్టేట్ డైరెక్టర్ వీరభద్రుడు తో పాటు సిద్ధవటం మండల ఐటిడిపి అధ్యక్షులు పెగడ హరి ప్రసాద్ , మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రతినిధి డేరంగుల శ్రీకాంత్, జనసేన యువ నాయకుడు పేరూరి కొండయ్య , రవి , అవ్వారు శ్రీను  బంధువులు, గ్రామ ప్రజలు అనేకమంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!