ePaper
Monday, April 6, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్రాయచోటి లో పిడిఎస్ యు ఆధ్వర్యంలో భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ సింగ్ వర్ధంతి...

రాయచోటి లో పిడిఎస్ యు ఆధ్వర్యంలో భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ సింగ్ వర్ధంతి సభ

📰 Generate e-Paper Clip

రాయచోటి, మార్చి 25(ప్రజా సీమ); పీడీఎస్‌యు ఆధ్వర్యంలో షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌ల 95వ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్ర కార్యవర్గం పిలుపుమేరకు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మూడవరోజు బుధవారం మాసాపేటలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. అంకన్న మాట్లాడుతూ విప్లవ వీరుల త్యాగాలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయని, సమానత్వం, స్వేచ్ఛ కోసం వారి పోరాటం నేటికీ మార్గదర్శకమని తెలిపారు.
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ యుద్ధ చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగానికి హానికరమైన భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు. మార్చి 23 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చందు, జస్వంత్, సురేష్, సిద్ధార్థ, గౌస్, ఇర్షాద్, నాగార్జున రెడ్డి, అర్షద్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!