ePaper
Monday, April 6, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయాలి.... బి టీ ఏ

కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయాలి…. బి టీ ఏ

📰 Generate e-Paper Clip

రాయచోటి మార్చి 10(ప్రజా సీమ ప్రతినిధి)

ఉద్యోగ ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పల్లం రామచంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి జీ రాజశేఖర్ అసోసియేట్ ప్రెసిడెంట్ ఏవీ రమణ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ షేక్ అబ్దుల్ రజాక్, అన్నమయ్య జిల్లా ఆర్థిక కార్యదర్శి సీవీ రమణ డిమాండ్ చేశారు ఈరోజు వారు చదువుల తల్లి క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ సర్కిల్లో సావిత్రి బాయి పూలే చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులర్పించారు. సావిత్రి బాయి పూలే బాటలో అణగారిన బడుగు బలహీన వర్గాల విద్య మరియు వారి అభ్యున్నతి కోసం బీటీఏ పని చేస్తుందని వారు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు మెరుగైన పిఆర్సీ ఇస్తామని డిఏ బకాయిలు సకాలంలో చెల్లిస్తామని సంపాదిత సెలవుల నగదును జడ్పీపీఎఫ్ లోన్లను వెంటనే మంజూరు చేస్తామని ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్న ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందన్నారు
ఎన్నికల హామీల సాధన కోసం విద్యారంగా సమస్యలు పరిష్కారంలో భాగంగా బీటీఏ ఆధ్వర్యంలో దశల వారి ఉద్యమాన్ని చేపట్టినట్టు వారు తెలియజేశారు. అనంతరం వివిధ మండల కమిటీలను ప్రకటించారు.
వీరబల్లి మండల అధ్యక్షులుగా కె రాజ్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా డి నాగార్జున,సుండుపల్లి మండల అధ్యక్షులుగా ఇర్షాద్ ప్రధాన కార్యదర్శిగా బీఎస్ ఆంజనేయులు,ఆర్థిక కార్యదర్శిగా వీరాంజనేయులను, రాయచోటిమండల అధ్యక్షులుగా సోనూ నాయక్ ప్రధాన కార్యదర్శిగా రఘునాధ పార్టీ కార్యదర్శులు ఎస్ వి రమణలను అలాగే గాలివీడు మండల అధ్యక్షులుగా శ్రీరాములు ప్రధాన కార్యదర్శిగా సాకే సత్యమయ్యలను ఎన్నుకున్నట్లు వారు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!