ePaper
Monday, April 6, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్నేషనల్ ఒలింపియాడ్ టాలెంట్ టెస్ట్‌లో రవిచంద్ర సి బి ఎస్ ఈ పాఠశాల విద్యార్థుల ప్రతిభ:

నేషనల్ ఒలింపియాడ్ టాలెంట్ టెస్ట్‌లో రవిచంద్ర సి బి ఎస్ ఈ పాఠశాల విద్యార్థుల ప్రతిభ:

📰 Generate e-Paper Clip

గాలివీడు,మార్చి 10 (నేటి పత్రిక ప్రజాసీమ విలేకరి):
హైదరాబాద్‌కు చెందిన అపెక్స్ ఐఐటీ-నీట్ ఫౌండేషన్ సంస్థ నిర్వహించిన నేషనల్ ఒలింపియాడ్ టాలెంట్ టెస్ట్‌లో రవిచంద్ర పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి మెడల్స్ సాధించడం పట్ల పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు.ఈ పరీక్షలో భాగంగా నిర్వహించిన స్టేజ్-1 మరియు స్టేజ్-2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రుల సమక్షంలో ఘనంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సైజు తామస్ మాట్లాడుతూ, అపెక్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలో దేశవ్యాప్తంగా 500కు పైగా పాఠశాలల విద్యార్థులతో పోటీపడి తమ పాఠశాల విద్యార్థులు మెడల్స్ సాధించడం గర్వకారణమని తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా గోల్డ్ మెడల్ సాధించిన నలుగురు విద్యార్థులు, సిల్వర్ మెడల్ సాధించిన ఐదుగురు విద్యార్థులు, బ్రాంజ్ మెడల్ సాధించిన నలుగురు విద్యార్థులను పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రుల సమక్షంలో ఘనంగా అభినందించింది.ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ లిజా జాయ్,IIT incharge ఆంజనేయులు,ఉపాధ్యాయులు రమేష్ , రామయ్య, ఆశిష్, శివ ప్రసాద్, షకీరా విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!