సేవా సంకల్పంలో అంగన్వాడీల త్యాగం అనన్యసామాన్యం.
రైల్వే కోడూరు ప్రజా సీమ
రైల్వేకోడూరులో ఘనంగా అంగన్వాడీ ఉత్సవం.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా మంగళవారం రోజు శెట్టిగుంట 1.శెట్టిగుంట 2 శెట్టిగుంట 3. లక్ష్మీ గారి పల్లి అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ ఉత్సవం వైభవంగా జరిగింది.బీజేపీ తిరుపతి మహిళా మోర్చా కార్యదర్శి మావిళ్ల జ్యోతి శ్రీ ఆధ్వర్యంలో జరిగినది ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులుసాయం శ్రీధర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈసందర్భంగా రైల్వే కోడూర్ , ఐ సి డి ఎస్స్ సూపర్వైజర్ యశోద టీచర్లు,ఆయాలు,ఆశా కార్యకర్తలను శాలువాలతో ఘనంగా సన్మానించారు.అనంతరం గర్భిణులకు పౌష్టిక ఆహారం గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమానికి మండల ప్రధాన కార్యదర్శులు కుప్పాల కిరణ్ కుమార్, కాలప్ప గారి రాము పాల్గొన్నారు.

