ePaper
Saturday, October 10, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్విస్డం సెంట్రల్ స్కూల్ లో ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలు

విస్డం సెంట్రల్ స్కూల్ లో ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలు

📰 Generate e-Paper Clip

విస్డం సెంట్రల్ స్కూల్ లో ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలు

రైల్వేకోడూరు మేజర్ న్యూస్

రైల్వే కోడూరు కొత్త బజార్ లోని విస్డం సెంట్రల్ స్కూల్ (నర్సరీ నుంచి పదవ తరగతి ) నందు గురువారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి.ఈ వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థులందరూ శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. చిన్నారులు కృష్ణాష్టమికి సంబంధించిన భక్తి గీతాలకు నృత్య ప్రదర్శనలు చేసి, కృష్ణ లీలల కథలు చెప్పి, పద్యాలు, భజనలు ఆలపించారు. పాఠశాల ప్రాంగణాన్ని కృష్ణుడి బాల్య లీలలను తలపించేలా అందంగా అలంకరించారు.అనంతరం పాఠశాల కరస్పాండెంట్ *డాక్టర్ టి. ప్రదీప్ మాట్లాడుతూ, శ్రీకృష్ణుని జీవితం, ఆయన బోధించిన భగవద్గీత సారాంశం, ధర్మ పరిరక్షణలో కృష్ణుడి గొప్పతనం గురించి విద్యార్థులకు వివరించారు.వేడుకల్లో భాగంగా విద్యార్థులకు నృత్యం, గానం, ఫాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. చివరిగా కృష్ణుడికి అత్యంత ప్రీతికరమైన ఉట్టి కొట్టే వేడుకను విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఎంతో ఉత్సాహంగా, సరదాగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ టి. ప్రదీప్, ప్రిన్సిపల్ టి. ప్రియాంక, అడ్మిన్ డైరెక్టర్ టి. మదన్ మోహన్, అకడమిక్ ఇన్‌ఛార్జ్ ముఖేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!