పశువుల షెడ్డు నిర్మాణానికి భూమిపూజ నిర్వహించిన అరవ శ్రీధర్ యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి
రైల్వేకోడూరు ప్రజాసేమ
పల్లె పండుగ 3.0తో పల్లెల్లో అభివృద్ధి పరుగులు.. శెట్టిగుంట పంచాయతీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన అరవ శ్రీధర్ గారు మరియు ముక్కా సాయి వికాస్ రెడ్డి.
పల్లె పండుగ 3.0లో భాగంగా వీబీజీ రామ్ జి నిధులతో కోడూరు మండలం శెట్టిగుంట గ్రామ పంచాయతీ పెద్దపాడు గ్రామంలో చేపట్టనున్న పశువుల షెడ్డు నిర్మాణ పనులకు *రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ గారు, రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి కుమారుడు యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు* మాట్లాడుతూ గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు రైతులు, పశుపోషకుల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. పల్లె పండుగ 3.0 ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.పశుసంపద గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పశువుల సంరక్షణకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా రైతులు, పశుపోషకులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. శెట్టిగుంటలో నిర్మించనున్న పశువుల షెడ్డు స్థానిక రైతులకు, పశుపోషకులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. పల్లె పండుగ 3.0 ద్వారా గ్రామాల్లో ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే పనులకు ప్రాధాన్యత కల్పిస్తున్నారని చెప్పారు. రైతులు, పశుపోషకుల సంక్షేమానికి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతకు పల్లె పండుగ 3.0 కార్యక్రమం నిదర్శనంగా నిలుస్తోందని నాయకులు పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తూ, రైతులు, పశుపోషకుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో చెర్మన్ జయప్రకాశ్ గారు,NDA కూటమి నేతలు, సంబధిత అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

