విద్యుత్ భరోసాకు బిగ్ స్టెప్.. బాలిరెడ్డిపల్లిలో నూతన సబ్‌స్టేషన్‌కు భూమిపూజ
రైల్వేకోడూరు ప్రజా సీమ
గ్రామీణ ప్రగతికి మౌలిక వసతులే ప్రాణాధారం: టీడీపి ఇంచార్జ్ & కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి రైతాంగానికి నాణ్యమైన విద్యుత్, లో-వోల్టేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి .
రైల్వే కోడూరు మండలం బాలిరెడ్డిపల్లి.. రూపానంద రెడ్డి , సాయి వికాస్ రెడ్డిలకు ఘన స్వాగతం గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని, మౌలిక వసతుల కల్పనకు తమ ప్రాధాన్యతనిస్తామని *రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారు* స్పష్టం చేశారు. ఓబులవారిపల్లి మండలం బలిరెడ్డిపల్లి పంచాయతీలో రూపుదిద్దుకోనున్న నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు *యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డిగారు* మరియు విద్యుత్ శాఖ అధికారులు,ఎన్డీఏ కూటమి నాయకులతో కలసి ఆయన బుధవారం పవిత్ర భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బలిరెడ్డిపల్లి పరిసర ప్రాంతాల ప్రజలు, రైతులు, కూటమి కార్యకర్తలు ముక్కా రూపానంద రెడ్డికి, ముక్కా సాయి వికాస్ రెడ్డికి పూలమాలలు ఘనంగా స్వాగతం పలికారు.
రైతాంగానికి ఊరట – విద్యుత్ సమస్యలకు శాశ్వత ముగింపు
*ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ*.:-. ఈ నూతన సబ్‌స్టేషన్ అందుబాటులోకి రావడంతో బలిరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందుతుందని, గత కొంతకాలంగా వేధిస్తున్న లో-వోల్టేజ్, తరచూ విద్యుత్ అంతరాయాల సమస్యలకు ఇది శాశ్వత పరిష్కారంగా నిలుస్తుందని పేర్కొన్నారు.నాణ్యతతో, వేగవంతంగా పనులు పూర్తి చేయాలి
భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న విద్యుత్ శాఖ జిల్లా, నియోజకవర్గ స్థాయి అధికారులతో రూపానంద రెడ్డి ప్రత్యేకంగా సమీక్షించారు. ప్రజలు, రైతుల సౌకర్యార్థం సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను ఎలాంటి ఆలస్యం లేకుండా వేగవంతంగా, నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తమ ప్రాంతంలో విద్యుత్ కష్టాలు తీర్చేందుకు చొరవ చూపిన ముక్కా రూపానంద రెడ్డి నాయకత్వంపై స్థానిక ప్రజలు, రైతాంగం హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, ఎన్డీఏ (TDP, జనసేన, బీజేపీ) కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

