- రోడ్డు ప్రమాదాల నివారణకు బారికేడ్ల ఏర్పాటు
రైల్వేకోడూరు ప్రజాసీమ
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా, రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో రైల్వేకోడూరు పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో మంగంపేట అగ్రహారం వ గల కట్టపుట్టాలమ్మ ఆలయం సమీపంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు.ఆ ప్రాంతంలో వాహనాల వేగాన్ని నియంత్రించడం, రహదారి భద్రతను మెరుగుపరచడం మరియు వాహనదారులకు ప్రమాద హెచ్చరిక కల్పించడం కోసం ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వాహనదారులు బారికేడ్లను గమనించి వేగాన్ని తగ్గించి, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని పోలీసులు సూచించారు.

