ePaper
Monday, April 6, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్రైల్వే అండర్ బ్రిడ్జి పనులు త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు;చమర్తి జగన్ మోహన్ రాజు

రైల్వే అండర్ బ్రిడ్జి పనులు త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు;చమర్తి జగన్ మోహన్ రాజు

📰 Generate e-Paper Clip

 

రాజంపేట పట్టణం;

రైల్వే అండర్ బ్రిడ్జి సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరిస్తానని నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు  తెలియజేశారు.బుధవారం నాడు “చమర్తి మార్నింగ్ వాక్ ” కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ సిబ్బంది మరియు ఎంపీడీవో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో కలిసి రైల్వే అండర్ బ్రిడ్జి ప్రాంతాన్ని చమర్తి జగన్ మోహన్ రాజు  పరిశీలించారు.ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ రైల్వే బ్రిడ్జి నిర్మాణం కొరకు అక్కడ తొలగించవలసిన భవనాల యజమానులతో స్వయంగా చమర్తి చర్చించి,వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తానని జగన్ మోహన్ రాజు  భరోసా కల్పించారు. స్థానికుల కోరిక మేరకు మున్సిపల్ స్థలం నందు లీజు ప్రాతిపదికన వారు దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి షాపులో ఏర్పాటుకు అనుమతులు వచ్చేలా కృషి చేస్తానని భరోసానిచ్చారు. అండర్ బ్రిడ్జి నిర్మాణం కొరకు స్థలాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లిస్తే సరిపోతుందని,అక్కడి వ్యాపారస్తులు స్థానికులు తెలపడంతో ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని జగన్ మోహన్ రాజు హామీ ఇచ్చారు.అనంతరం విద్యార్థులు వ్యాపారస్తులు, ఎదుర్కొంటున్న,రైల్వే అండర్ బ్రిడ్జి సమస్య పరిష్కారానికి చమర్తి ఆధ్వర్యంలో పునాది పడినట్లు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మరియు పంచాయతీరాజ్ అధికారులు,రాజంపేట పట్టణ మరియు మండలాలకు మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!