రాజు కుంటలో..
ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు*
– భారీ రక్తదాన శిబిరం, అన్నదానం, మొక్కల పంపిణీ
– హాజరైన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తాతంశెట్టి నాగేంద్ర ముక్క సాయి వికాస్ రెడ్డి
రైల్వేకోడూరు ప్రజాసేమ
తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం చిట్వేలి మండలం రాజుగుంటలో మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. రెండు రాష్ట్రాల సినీ డిస్ట్రిబ్యూటర్స్ కమిటీ ప్రముఖులు, నైజాం నీడెడ్ అధినేత, స్థానిక మాజీ ఎంపీటీసీ నానబాల నాగార్జున, టిడిపి నియోజకవర్గ నాయకులు, స్థానిక మాజీ సర్పంచ్ గుత్తి నరసింహులు, మండల జనసేన నాయకులు మాదాసు నరసింహ మద్దూరి మన్మధ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భారీ రక్తదాన శిబిరంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి మండలంలోని వివిధ ప్రాంతాలతో పాటు నియోజకవర్గంలోని పలువురు ప్రముఖులు, చిరంజీవి అభిమానులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు.
రక్తదాన శిబిరంలో 58 మంది అభిమానులు, యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. తిరుపతికి చెందిన విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ సహకారంతో రక్తసేకరణ కార్యక్రమం నిర్వహించారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ వారి సేవా స్ఫూర్తిని నిర్వాహకులు కొనియాడారు. వారికి సర్టిఫికెట్లు అందజేశారు.
రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడే సేవ చేయడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా తమ వంతు బాధ్యతగా భావిస్తూ రక్తదాతలకు మొక్కలను అందజేశారు. గుండాలపల్లికి చెందిన పగడాల మణి ప్రసాద్ ఆధ్వర్యంలో 100 చెట్లను పంపిణీ చేశారు. రక్తదాతలను ‘ప్రాణదాతలతో పాటు పర్యావరణ ప్రేమికులు’గా గుర్తిస్తూ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ తిరుపతి ప్రతినిధి ఎన్. హరికృష్ణ రక్తదాన శిబిరం నిర్వహణలో సహకరించారు. రక్తదానం, అన్నదానం, మొక్కల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలతో చిరంజీవి జన్మదిన వేడుకలను నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
చిరంజీవి అభిమానులు ప్రతి ఏడాది జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తూ సమాజానికి తమ వంతు సేవ చేయడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా రక్తదాతలకు, కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పగడాల చంద్రశేఖర్ ఎర్రజన్న గారి చలపతి సూర్యాల ధర్మయ్య ఉప్పలపాటి శివప్రసాద్ రాజు గాడి ఇంతియాజ్ గొబ్బిళ్ళ చంగల్ రాయుడు వరదన్న గారి ప్రసాద్ నార్జాల దాశరధి నల్లంశెట్టి యానాది ముద్ద పోలు సభాపతి తుపాకుల పెంచలయ్య బొంతల నాగేశ్వరరావు పురం సురేష్ మాదాసు శివ కంచర్ల సుధీర్ రెడ్డి పెద్దం గారి సాయి కావేరి అవినాష్ ఆనందల తేజ షేక్ రియాజ్ దొండ్ల వాగు మధు కొనిశెట్టి చక్రి దాది చంద్ర మహంకాళి నాగేంద్ర సువారపు హరిప్రసాద్ భూమా సుబ్రహ్మణ్యం కొండయ్యగారి పల్లి మనీ ఎన్నార్ లోక్నాథ్ నాన్న బాల లోక్నాథ్ మాదాసు రవి సుగవాసి శివశంకర్ ఎద్దుల జయచంద్ర నుల వంశీ మాదినేని రాజా పవన్ రాజు తోట శివప్రసాద్ ఆనందల సాయి చిరంజీవి అభిమానులు జనసేన నాయకులు పాల్గొన్నారు

