తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం ఎంపీటీసీ అభ్యర్థి గంటా ఆదామును అత్యధిక మెజార్టీతో గెలిపించండి. సిగి చెన్నయ్య, జిల్లా కార్యదర్శి, సిపిఐ ఎంఎల్ లిబరేషన్. తిరుపతి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రైల్వే కోడూరు మండల ఎంపీటీసీ స్థానానికి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ అభ్యర్థిగా గంట ఆదామును అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు తిరుపతి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సిగి చెన్నయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అనేక సంవత్సరాల నుండి కమ్యూనిస్టు నాయకుడుగా తను చేసిన సేవలను కొనియాడారు. ఎలాంటి అధికార హోదా లేకుండానే పేద ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేసి ప్రభుత్వము ద్వారా రావలసిన అన్ని రకాల పథకాలను పేదలకు ఇప్పించడంలో సిగి చెన్నయ్య అవిరాల కృషి చేసినట్లు తెలిపారు. అదేవిధంగా మండల ఎంపీటీసీ అభ్యర్థిగా గంటా ఆదాము కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన అన్ని పోరాటాలలో భాగస్వామి అయి పేదల పక్షాన నిలబడ్డాడని ఆయన సేవలను గుర్తించి పార్టీ రాష్ట్ర కమిటీ ఆయనకు పోటీ చేసేటందుకు అవకాశం కల్పించింది అన్నారు. ఈ నేపథ్యంలో గంట ఆదామును అత్యధిక మెజారిటీతో గెలిపించి సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు. గంట ఆదాము ఎంపీటీసీగా గెలిచిన తర్వాత మండల స్థాయిలో రావలసిన నిధులను రాబట్టి ఎన్నో ఏళ్లగా పరిష్కారానికి నోచుకోని సమస్యల పైన కృషి చేస్తామని సందర్భంగా తెలిపారు. ముఖ్యంగా ఇండ్లు, ఇంటి స్థలాలు, తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ను ప్రజలకు చేరవేయుటకు ఆదాము సర్వీస్ ఉంటుందని ఆ రకంగా పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు. ఈనెల 21వ తేదీన ఆదాము నామినేషన్ కు పార్టీ శ్రేణులు, సానుభూతిపరులు, స్నేహితులు, బంధువులు అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యుడు సుబ్బయ్య పాల్గొన్నారు.
- Advertisment -ads

