జనసేన పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశం
రైల్వేకోడూరు ప్రజా సీమ
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో అసెంబ్లీ సమన్వయ కమిటీ సభ్యులు 1. పగడాల వెంకటేష్ 2. కారుమంచి సంయుక్త 3. కటికం నాగేంద్ర స్థానిక సంస్థల ఎన్నికలపై 32 మంది నిర్వాహ కి దళ్, సపోర్ట్ టీం 5 మంది, రాజంపేట పార్లమెంట్ నిర్వాహక దళ్ సభ్యులు 9 మందితో సమావేశం ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని ఐదు మండలాల లోని ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానాలపై చర్చించడమైనది. జనసేన పార్టీ అభ్యర్థులతో పాటు కూటములోని అభ్యర్థులను కూడా సమన్వయం చేసి 100% స్ట్రైక్ రేట్ తో గెలిచి డిప్యూటీ సీఎం గారికి బహుమానంగా ఇవ్వాలని సమన్వయ కమిటీ తీర్మానించడం అయినది. సమావేశములో ముఖ్య అతిథులుగా కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ , రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర గారు, కోడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ శ్రీమతి పగడాల వరలక్ష్మి పాల్గొన్నారు. మరియు పార్టీ సీనియర్ నాయకులు బత్తిన గంగన్న యాదవ్ , జోగినేని మనీ , పగడాల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

