ePaper
Friday, October 9, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్నరేంద్ర మోడీ  జన్మదినోత్సవాలలో భాగంగా యువ మోర్చా ఆధ్వర్యంలో మెగా రక్తదానశిబిరం ఏర్పాటు

నరేంద్ర మోడీ  జన్మదినోత్సవాలలో భాగంగా యువ మోర్చా ఆధ్వర్యంలో మెగా రక్తదానశిబిరం ఏర్పాటు

📰 Generate e-Paper Clip

నరేంద్ర మోడీ  జన్మదినోత్సవాలలో భాగంగా యువ మోర్చా ఆధ్వర్యంలో మెగా రక్తదానశిబిరం ఏర్పాటు

రైల్వేకోడూరు ప్రజా సీమ

సేవా, సంకల్ప మహా అభియాన్ -2026 సేవా కార్యక్రమాల్లో భాగంగా  ( మంగళవారం ) తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం ( గవర్నమెంట్ హాస్పిటల్ ) లో రక్షణా బ్లడ్ బ్యాంక్ తిరుపతి వారి సహకారంతో రైల్వే కోడూరు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.ప్రియతమ ప్రధానమంత్రి శ్రీమాన్ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు నెల రోజుల పాటు నిర్వహించే 25 సేవా కార్యక్రమాల్లో “మీరు చేసే రక్తదానం – ఒక ప్రాణానికి పునర్జన్మ” రక్తదానం చేయండి – ప్రాణాలను కాపాడండి అనే నినాదంతో ఈరోజు 41 యూనిట్లు రక్తాన్ని మోడీ  అభిమానులు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  నాగోతు రమేష్ నాయుడుతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు  గడ్డం చంగల్ రాజు , తులసి ఎడ్యుకేషనల్ అకాడమీ కరస్పాండెంట్  మేకపాటి తులసీ, సామాజిక ఆరోగ్య కేంద్రం కోడూరు సూపరెంటెడ్ బ్రహ్మ కుమారి, రైల్వే కోడూరు మండల అధ్యక్షులు సాయం శ్రీధర్, యువ మోర్చా జిల్లా సెక్రటరీ కుంభకోణం సాయి ఆచారి,కిసాన్ మోర్చా అన్నమయ్య జిల్లా ఇంఛార్జి తోట శ్రీనివాసులు, మహిళా మోర్చా జిల్లా సెక్రటరీ  కుప్పాల జ్యోతి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు విజయ్ కుమార్ , ఓ బి సి మోర్చా నీలపూజ సుబ్రహ్మణ్యం, కౌన్సిల్ మెంబర్ వాకచర్ల సుబ్బారావు, మండల ప్రధాన కార్యదర్శులు కాళప్పగారి రాము, కుప్పాల కిరణ్ ,ఉపాధ్యక్షులు శ్రీమతి తోట సుహాసిని, తోట జ్ఞాని , అందరివాడు సుబ్బారావు, ట్రెజరీ నార్జాల సుమంత్, మరియు కార్యకర్తలు మరియు మోడీ గారి అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!