శ్రీ శ్రీ శ్రీ కంచమ్మ తల్లి ఆలయంలో పౌర్ణమికి అన్నదాన కార్యక్రమం
రైల్వేకోడూరు ప్రజా సీమ
తిరుపతి జిల్లా రైల్వేకోడూరు మండలం ఓబనపల్లి గ్రామం: శ్రీ శ్రీ శ్రీ కంచమ్మ తల్లి ఆలయంలో ప్రతి పౌర్ణమి సందర్భంగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన సేవను అందించి నిర్వాహకులు తమ సేవాభావాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో మణేయ్య, చిన్నయ్య, గంగయ్య, ప్రసాద్, శివరామయ్య, సుబ్బరామయ్య, గడ్డం శ్రీరాములు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి పౌర్ణమి రోజున భక్తులకు అన్నదానం నిర్వహించడం ఆనందదాయకమని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయ పూజారి చిన్నయ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కంచమ్మ తల్లి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని భక్తులు ప్రార్థించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

