కోడూరులో అత్యంత కోలాహలంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు*
రైల్వేకోడూరు ప్రజాసేవ
విశేష ప్రజాదరణ మధ్య 55 కేజీల భారీ కేక్ కటింగ్ 500 మంది పేదలకు అన్నదానం*
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణ పరిధిలోని స్థానిక టోల్‌గేట్ సమీపంలో ఉన్న ఇందిరా బస్ షెల్టర్ వద్ద జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 55వ జన్మదిన వేడుకలు అత్యంత అంగరంగ వైభవంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి సంబరాలు జరుపుకున్నారు.
ఈ జన్మదిన వేడుకలకు జనసేన పార్టీ స్థానిక సంస్థల విధివిధానాల కమిటీ సభ్యులు డాక్టర్ యనమల భాస్కర్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వేడుకల్లో భాగంగా ప్రత్యేకంగా తయారు చేయించిన 55 కేజీల భారీ కేకును రైల్వే కోడూరు ప్రధాన పురవీధుల గుండా కోలాహలంగా, అభిమానుల జయజయధ్వానాల మధ్య భారీ ర్యాలీగా ఇందిరా బస్ షెల్టర్ వద్దకు తీసుకువచ్చారు. ర్యాలీ పొడవునా పవన్ కళ్యాణ్ నాయకత్వానికి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
జనసేన పార్టీ సీనియర్ నాయకులు తోట మల్లికార్జున్ రావు, ముద్దపోలు సభాపతి, నార్జాల దాశరథి, నల్లంశెట్టి యానాదయ్య ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు.వేదిక వద్దకు చేరుకున్న ముఖ్య అతిథులు, పార్టీ ప్రముఖులు కార్యకర్తల సమక్షంలో భారీ కేక్‌ను కట్ చేసి ఒకరికొకరు తీపి తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 55 కేజీల కేకును తమ అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పగడాల మణి ప్రసాద్, గల్లా మణి, శ్రీకారం ప్రకాష్, జనసేన ఎన్నారై నాయకులు ఎర్రంశెట్టి హరిబాబు, దాసరి పృద్వి లు సహాయ సహకారాలు అందించి కార్యక్రమ విజయవంతమవడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం వేడుకలకు విచ్చేసిన వందలాది మంది అభిమానులకు, స్థానిక ప్రజలకు కేకును పంపిణీ చేశారు. ఇదే సందర్భంగా సామాజిక బాధ్యతగా సుమారు 500 మంది నిరుపేదలకు ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భోజనాలు వడ్డించారు.
డాక్టర్ యనమల భాస్కర్ రావు మాట్లాడుతూ రైల్వే కోడూరు మట్టిలో నా దైవం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ప్రతి ఏటా కంటే ఈసారి మరింత వైభవంగా జరగడం ఎంతో హర్షణీయం. నాపై ఎంతో నమ్మకంతో నాకు రాష్ట్ర స్థాయిలో బాధ్యతాయుతమైన పదవిని కట్టబెట్టిన మన ప్రియతమ నేత పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులంతా సమిష్టిగా శ్రమించి, రైల్వే కోడూరు గడ్డపై జనసేన జెండాను రెపరెపలాడిస్తామని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేస్తున్నాను అని అన్నారు.
ఈ సందర్భంగా తోట మల్లికార్జున్ రావు మాట్లాడుతూ అనితర సాధ్యుడు ప్రజా నాయకుడు, మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మేమంతా నిరంతరం కలిసికట్టుగా కృషి చేస్తాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ముద్దపోలు సభాపతి మాట్లాడుతూ గత ఎన్నో సంవత్సరాలుగా ఇంద్ర బస్ షెల్టర్ వద్ద పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను ఒక పండుగలా నిర్వహించడం మాకు ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం కూడా అశేష జనవాహిని, నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా సంతోషంగా ఉంది.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ముద్దపోలు రామసుబ్బయ్య,మర్రీ రెడ్డిప్రసాద్, ఉత్తరాది శివకుమార్,దాసరి వీరేంద్ర, అంకి శెట్టి సుబ్రహ్మణ్యం, కొండేటి మనోజ్, గుర్రంకొండ వంశీ,కోక్కంటి మహేష్, మావిళ్ళ సుబ్బరాయుడు,సవరం సాయి, నగిరిపాటి మహేష్, లతో పాటు మైసూర్ వారి పల్లి యువత, నియోజకవర్గ నలుమూలల నుంచి తరలివచ్చిన జనసేన కార్యకర్తలు, వీరమహిళలు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను దిగ్విజయం చేశారు.

