ప్రభుత్వ భూములు, చెరువు కాలువల ఆక్రమణలపై ఇరిగేషన్ డి ఈ బాధ్యతారహిత వైఖరి: ఉమ్మలరాజు సురేష్ కుమార్ స్టేట్‌మెంట్
రైల్వేకోడూరు మేజర్ న్యూస్
తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు మండలం, అనంతరాజుపేట గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 1232/33 లోని ప్రభుత్వ భూమి ఆక్రమణ మరియు బొమ్మవరం చెరువు కాలువపై జరుగుతున్న అక్రమ కట్టడాలపై స్పందించాలని కోరుతూ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే, ఈ ఫిర్యాదుపై బాధ్యతాయుతంగా స్పందించాల్సిన ఇరిగేషన్ డి ఈ ఫోన్ చేసి మాట్లాడిన తీరు అత్యంత విడ్డూరంగా మరియు ఆందోళనకరంగా ఉంది.డి ఈ ఉచిత సలహా మరియు చేతులెత్తేసిన వైనం ఒక పెద్ద రాజకీయ నాయకుడు నేరుగా కలెక్టర్ కి ఫోన్ చేసి, “నేను చెప్తాను, నువ్వు సైలెంట్‌గా ఉండు అని చెప్పాడని, ఇక తాను ఏమీ చేయలేనని ఇరిగేషన్ డి ఈ చేతులెత్తేశారు.
* రాజకీయ నాయకులతోనే తేల్చుకోవాలని ఉచిత సలహా ఇస్తూ: “నీకు ఏమైనా కావాలంటే ఆ నాయకుడితోనే మాట్లాడుకో, నేనేం చేయలేను” అంటూ ఒక ప్రభుత్వ బాధ్యతాయుతమైన అధికారి మాట్లాడటం చట్టాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది.అధికారులను నేరుగా నిలదీస్తున్న ప్రశ్నలు చట్టాలు ప్రజల కోసమా లేక రాజకీయ నాయకుల కనుసన్నల్లో నడవడానికి ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల పన్నుల నుండి జీతాలు తీసుకుంటున్నారా బాధ్యత విస్మరణ ఎలా సాధ్యం కలెక్టర్ కి పెద్ద రాజకీయ నాయకుడు ఫోన్ చేశారనే సాకుతో, ప్రభుత్వ ఆస్తులను మరియు చెరువు కాలువలను కాపాడాల్సిన కనీస బాధ్యతను ఇరిగేషన్ డి ఈ ఎలా విస్మరిస్తారు, సామాన్య ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఆక్రమణలను అడ్డుకోవాల్సిన అధికారినే “నేనైతే ఏమీ చేయలేను” అని చేతులెత్తేస్తే, ఇక సామాన్య ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుంది, ఇలాంటి అధికారులపై చర్యలు ఏంటి రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొగ్గుతూ, వారి ఒత్తిళ్లకు తలొగ్గి ప్రజాధనాన్ని, ప్రభుత్వ భూములను ఆక్రమణదారులకు ధారపోస్తున్న ఇలాంటి అధికారులపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
తక్షణ డిమాండ్లు
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు ఈ ఉదాసీనతను, బాధ్యతారహితంగా వ్యవహరించిన ఇరిగేషన్ డి ఈ తీరును తీవ్రంగా పరిగణించాలి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారిపై తక్షణమే విచారణ జరిపి, చెరువు కాలువపై ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాలని ఈ స్టేట్‌మెంట్ ద్వారా తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాను.

