ePaper
Monday, August 10, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper

📰 Generate e-Paper Clip

సీఎం రాచపల్లి గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్న ముక్కా రూపానంద రెడ్డి

రైల్వేకడూరు ప్రజాసీమ న్యూస్

డోర్ టు డోర్ కార్యక్రమంలో ప్రజలతో మమేకమై కూటమి ప్రభుత్వ అభివృధి పై అవగాహన కల్పించిన ముక్కా రూపానంద రెడ్డి డోర్ టు డోర్ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృధి కార్యక్రమాలపై హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు*

చిట్వేల్ మండలం సీఎం రాచపల్లి గ్రామంలో నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమంలో *రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్‌చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి  పాల్గొన్నారు.ఈరోజు పలు పంచాయతీలో పర్యటించి గ్రామ ప్రజలను నేరుగా కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.గ్రామాభివృద్ధికి అవసరమైన రహదారులు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, పెన్షన్లు తదితర అంశాలపై కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!