ePaper
Monday, August 10, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అక్రమ మట్టి రవాణా చేస్తే వాహనాలు సీజ్:పుల్లంపేట తహసిల్దార్ మురళీకృష్ణ

అక్రమ మట్టి రవాణా చేస్తే వాహనాలు సీజ్:పుల్లంపేట తహసిల్దార్ మురళీకృష్ణ

📰 Generate e-Paper Clip

పుల్లంపేట(ప్రజా సీమ)

 

పుల్లంపేట మండలంలో అనుమతులు లేకుండా మట్టి అక్రమ రవాణా చేస్తూ ప్రభుత్వ భూముల ఆక్రమణకు సహకరిస్తూ మట్టి రవాణా చేస్తే అటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు తో పాటు వాహనాలు సీజ్ చేయబడతాయని పుల్లంపేట తాహసిల్దార్ మురళీకృష్ణ హెచ్చరించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ అనుమతులు లేకుండా చెరువుల నుండి మట్టి రవాణా చేస్తున్నారని, ప్రభుత్వ భూములకు ఆ మట్టిని తరలించి భూముల కబ్జాకు పాల్పడుతున్నారని, ఇరిగేషన్ వారు అనుమతి ఇచ్చినా అనుమతి పత్రాలు రెవెన్యూ అధికారులకు సమర్పించి ఏ భూమికి మట్టి తోలుకుంటున్నారో ఆధారాలు అందించాలని, అలా కాకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని, ముఖ్యంగా వాహనాల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలను సీజ్ చేయబడతాయని ఆయన తెలియజేశారు.

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!