ePaper
Tuesday, July 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్బొప్పాయి తోటల్లో ఎంఆర్‌ఓ ఆకస్మిక తనిఖీలు తాసిల్దార్ అమర్నాథ్ 

బొప్పాయి తోటల్లో ఎంఆర్‌ఓ ఆకస్మిక తనిఖీలు తాసిల్దార్ అమర్నాథ్ 

📰 Generate e-Paper Clip

బొప్పాయి తోటల్లో ఎంఆర్‌ఓ ఆకస్మిక తనిఖీలు తాసిల్దార్ అమర్నాథ్

రైల్వేకోడూరు మేజర్ న్యూస్

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండల వ్యాప్తంగా బొప్పాయి కోతలు జరుగుతున్న తోటలు, బొప్పాయి లోడుతో ఉన్న లారీలను మండల రెవెన్యూ అధికారి (ఎంఆర్‌ఓ) అమర్నాథ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గిట్టుబాటు ధర, వ్యాపారుల కొనుగోలు తీరుపై ఆయన నేరుగా రైతులతో మాట్లాడి వివరాలు సేకరించారు.కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీలు గురువారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బొప్పాయి రైతుల సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొనుగోలుదారులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కిలో బొప్పాయికి కనీసం ₹16 మద్దతు ధర చెల్లించి కోతలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించి రైతులను మోసగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు ఎంఆర్‌ఓ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించేందుకు ఈ తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు.

తనిఖీల సందర్భంగా తోటల వద్ద కోతలు ఎలా జరుగుతున్నాయి, లారీ లోడింగ్ వివరాలు మరియు వ్యాపారులు ఇస్తున్న ధరపై రైతులతో ఎంఆర్‌ఓ సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ — ప్రస్తుతం తమ వద్ద కిలో ₹16 చొప్పున కొనుగోలు చేస్తున్నారని, గతంతో పోలిస్తే మంచి ధర లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అధికారుల చొరవ వల్ల తమకు న్యాయం జరిగిందని ఆనందం వ్యక్తం చేస్తూ ఎంఆర్‌ఓ, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.

వ్యాపారులు ఎవరైనా రైతులకు తక్కువ ధర చెల్లించినా లేదా చెల్లింపుల్లో వేధింపులకు గురిచేసినా వెంటనే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఎంఆర్‌ఓ కోనేటి అమర్నాథ్ సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!