ePaper
Thursday, July 16, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeజాతియంరేపే అన్నదాత సుఖీభవ 3.0 సాయం - కర్షకులకు కూటమి ప్రభుత్వ ఉగాది కానుక

రేపే అన్నదాత సుఖీభవ 3.0 సాయం – కర్షకులకు కూటమి ప్రభుత్వ ఉగాది కానుక

📰 Generate e-Paper Clip

 

అమరావతి, మార్చి 12:(ప్రజాసీమ ప్రతినిధి)

కానుకగా కూటమి ప్రభుత్వం రైతన్నలకు ‘అన్నదాత సుఖీభవ’ నిధులు జమ చేయనుంది. ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ 3.0’లో భాగంగా రైతులకు శుక్రవారం ఆర్థిక సాయాన్ని విడుదల చేయనుంది. మూడవ విడతగా 46.85 లక్షల మందికి కేంద్ర, రాష్ట్ర వాటా కలిపి ఒక్కో రైతు అకౌంట్‌లో రూ.6,000 జమ చేయనుంది. మూడో విడతగా రూ.2,676 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి. ఇందులో రాష్ట్ర వాటా రూ.1,874 కోట్లు. ఇప్పటికే రెండు విడతల కలిపి రూ.14 వేలను ప్రభుత్వం అందించింది. శుక్రవారం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రైతులకు ఇచ్చిన హామీ ఏడాదికి రూ.20 వేల సాయం పూర్తవుతుంది.

*ఏడాదిలో రూ.8,985 కోట్ల సాయం*

ఒక్కో రైతు కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని కూటమి సూపర్ -6లో పేర్కొంది. కేంద్రం పీఎం కిసాన్ కింద రూ.6,000, రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 కలిపి మూడు విడతల్లో ప్రతీ రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు 2025 ఆగస్ట్ 2న మొదటి విడతగా రూ.7 వేల చొప్పున రూ.3,174 కోట్లు, నవంబర్ 19న రెండవ విడతగా రూ.7 వేల చొప్పున రూ.3,135 కోట్లు కలిపి రూ.6,309 కోట్లు రైతులకు అందించింది. రేపు మూడో విడతలో రూ.6 వేల చొప్పున 46.85 లక్షల మందికి రూ.2,676 కోట్లు ఇవ్వనుంది. ఒక్క ఏడాదిలోనే రైతు సోదరులకు కూటమి ప్రభుత్వం రూ.8,985 కోట్లు అందించినట్లు అవుతుంది. ఇందులో రాష్ట్ర వాటా రూ.6,560 కోట్లు కాగా, కేంద్రం వాటా రూ.2,425 కోట్లు.

*సూరంపల్లి నుంచి నిధులు విడుదల చేయనున్న సీఎం*

అన్నదాత సుఖీభవ 3.0 నిధులు విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం, సూరంపల్లిలో శుక్రవారం అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4.20 గంటలకు సీఎం సూరంపల్లికి చేరుకుంటారు. 4.25 గంటల నుంచి 4.55 గంటల వరకు రైతు సోదరులతో ముఖాముఖి అవుతారు. 05.00 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారు.
********

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!