ePaper
Monday, April 6, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్బెటాలియన్ లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి వేడుకలు

బెటాలియన్ లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

సిద్ధవటం ప్రజాసీమ: సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామపంచాయతీ భాకరాపేట గ్రామ సమీపాన 11వ బెటాలియన్ నందు సోమవారం ఉదయం కమాండెంట్ కె ఆనంద రెడ్డి ఆదేశాల మేరకు 11వ పోలీస్ బెటాలియన్ లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి వేడుకలు నిర్వహించడమైనది, ఈ కార్యక్రమం నందు పి రాజశేఖర్, అసిస్టెంట్ కమాండెంట్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు, ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు నవంబర్ 24, 1806న కర్నూలు జిల్లా రూపనగుడి గ్రామంలో మల్లారెడ్డి, సీతమ్మ దంపతులకు జన్మించారు. ఆయన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా (అప్పటి కర్నూలు) కోయిలకుంట్ల ప్రాంతానికి చెందిన పాలెగాడు. బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా, ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి పదేళ్ల ముందే తెలుగు నేలపై తిరుగుబాటు చేసిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఆయన చేసినటువంటి త్యాగాలు చిరస్మరణీయం అని కొనియాడారు మరియు అతని యొక్క గొప్పతనము గురించి వివరించడం జరిగినది. ఈ యొక్క కార్యాక్రమము నందు బెటాలియన్ సిబ్బంది పాల్గొనడం జరిగింకిది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!