ePaper
Monday, April 6, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్టిడిపి లీడర్ కుమార్తె ఓణీల ఫంక్షన్ కు హాజరైన టిడిపి నాయకులు

టిడిపి లీడర్ కుమార్తె ఓణీల ఫంక్షన్ కు హాజరైన టిడిపి నాయకులు

📰 Generate e-Paper Clip

స్టేట్ డైరెక్టర్ డాక్టర్ నాగూర్ వీరభద్రుడు

సిద్ధవటం ఫిబ్రవరి 22 ప్రజాసీమ: రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలంలోని సిద్ధవటం టిడిపి లీడర్ వెంకటయ్య, కుమార్తె ఓణీల ఫంక్షన్, భాకరాపేట సిద్ధవటం రోడ్డులో గల ఫంక్షన్ హాల్ లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ స్టేట్ నూర్ భాషా/దూదేకుల కోపరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ నాగూరు వీరభద్రుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనుమరుగైపోతున్న ఇటువంటి సాంప్రదాయ ఫంక్షన్ ను ఎంతో ఘనంగా నిర్వహించిన టిడిపి లీడర్ వెంకటయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా వారి కుమార్తెకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని టిడిపి నాయకులు సిద్ధవటం సింగిల్ విండో చైర్మన్ దారపునేని దశరధ రామానాయుడు , సిద్ధవటం మాజీ ఏఎంసీ చైర్మన్ సయ్యద్ జవహర్ బాషా , సింగిల్ విండో డైరెక్టర్ బాల్ రెడ్డి , కో క్లస్టర్ శంకర్ రెడ్డి , మండల టిడిపి ప్రధాన కార్యదర్శి వీరనాల రామచంద్ర ,మండల మహిళా అధ్యక్షురాలు కమాల్ బీ , నియోజకవర్గ మహిళా నాయకురాలు కోటపాటి సుబ్బమ్మ , మాధవరం టిడిపి నాయకులు హరి, మాధవరం టిడిపి ప్రధాన కార్యదర్శి మామిళ్ళ మురళి రాయల్ మరియు పలువురు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!