ePaper
Monday, April 6, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్2026 జాబ్ క్యాలండర్ లో వ్యాయామ విద్య పోస్ట్లు మంజూరు చేయాలి

2026 జాబ్ క్యాలండర్ లో వ్యాయామ విద్య పోస్ట్లు మంజూరు చేయాలి

📰 Generate e-Paper Clip

 

మదనపల్లి మార్చి 22 (ప్రజా సీమ ప్రతినిధి):

ఉగాధి సందర్భముగా 2026 సం॥ గాను విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ నందు, పాఠశాల విద్య లో భాగంగా వ్యాయామ విధ్య (physical Education) విభాగంలో ఎటువంటి పి.డి పోస్ట్లు చూపించక పోవడం శోచనీయం. అనేక సందర్భాలలో ప్రభుత్వ పెద్దలు ఎన్నో వేదికలపైన ఆంధ్ర ప్రదేశ్ క్రీడలకు పెద్ద పీట వేస్తున్నా మని చెప్పటం తప్ప, ఆచరణలో మాత్రం శూన్యం. వ్యాయామ విద్యపై చిన్న చూపు చూడడం తగదని విద్యార్థులలో అంతరించిపోతున్న క్రమశిక్షణను వ్యాయామ విద్యపైప్రభుత్వం పునరాలోచన చేసి ప్రాథమిక పాఠశాల స్థాయి నుండి P.E.T పోస్టులను, విద్యార్థుల సంఖ్యతో సంబందం లేకుండా ప్రతి ఉన్నత పాఠశాలలకు S.A (PE) Post లను మంజూరు చేసి రాబోయే D.S.C 2026 ద్వారా భర్తీ చేయాలని కోరుతున్నాము.

ఇంటర్మీడియట్ నుండి వ్యాయామవిద్య అవసరం:

ఇప్పటికే దశాబ్ద
కాలముగా ఎటువంటి వ్యాయామ విద్య పోస్ట్ భర్తీ లేని ఒక్క ఉమ్మడిచిత్తూరు జిల్లాలో మాత్రం ఇంటర్మీడియట్ కళాశాలలకు పిడి పోస్టులు ఖాళీగా 64 ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 630 పోస్టులు JL ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్ట్ లు భర్తీ కి దశాబ్ద కాలంగానోచుకొలేదు కళాశాల విద్య నుండి విద్యార్థులలో క్రమశిక్షణ పూర్తిగా నశించింది ఇప్పటికైనా కనీసం నోషనల్ గా రాష్ట్రవ్యాప్తంగా పదోన్నతులు కల్పించి జూనియర్ కళాశాలలోని పోస్టులు భర్తీ చేస్తే ఈ DSC-26 లో సుమారు 700 ఖాళీ పోస్ట్లు భర్తీ చేయవచ్చును గౌరవ మంత్రివర్యులు యువకులు నారా లోకేష్ గారు మీరైనా వ్యాయామ విద్యపై కనికరించి JL PD లు గా పదోన్నతి కల్పించి అన్ని ఇంటర్మీడియట్ కళాశాలలో పిడి పోస్టులు ఉండే విధంగా తమరు మంజూరు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము.

పి నరేష్ బాబు, SAPE అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ ఫీజికల్ ఎడ్యుకేషన్ అన్నమయ్య జిల్లా , ప్రభుత్వాన్ని సవినయంగాకోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!