ePaper
Wednesday, February 11, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్13 న పుల్లయ్య స్వామి ఆరాధన ఉత్సవం

13 న పుల్లయ్య స్వామి ఆరాధన ఉత్సవం

📰 Generate e-Paper Clip

సిద్ధవటం ఫిబ్రవరి 11 నేటిపత్రిక ప్రజాసీమ : కడప చెన్నై జాతీయ రహదారి బాకరాపేట శివారులో భాకరాపేట లో వెలసిన శ్రీ శ్రీ శ్రీ భవానిశంకర స్వామి మరియు అవధూత పుల్లయ్య స్వామి ఆరాధన ఉత్సవం ఈనెల 13 (వెంకటరాజయ్య)ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శుక్రవారం స్వామి వారిని పుష్పమాలికలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించనున్నారు.ఉదయం 8 గంటల నుండి మేళ తాళాలతో స్వాములవారి ఊరేగింపు , తదుపరి 12గం!! నుండి అన్న ప్రసాద వితరణ కార్యక్రమము జరుపుటకు గ్రామస్తులు నిర్ణయించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా పాల్గొని జయప్రదం చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!