ePaper
Monday, April 6, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటిన బీరం శ్రీధర్ రెడ్డి కళాశాల

జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటిన బీరం శ్రీధర్ రెడ్డి కళాశాల

📰 Generate e-Paper Clip

–జేఈఈ అంటే బీరం – బీరం అంటే జేఈఈ

కడప, ఫిబ్రవరి 17 ప్రజాసీమ: కడప జిల్లా, ఖాజీపేట మండలం బీరం శ్రీధర్ రెడ్డి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు నేడు విడుదలైన జేఈఈ మెయిన్స్ మొదటి ఫలితాల్లో 17 మంది విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ చూపించి ఫలితాల్లో మంచి శాతాన్ని సాధించారు.ఈ అద్భుతమైన గెలుపు సాధించిన విద్యార్థులు వరుసగా టాప్ స్కోర్లు: 99.83 – Y. వరుణ్ సందేశ్ 99.61 – షేక్ మోహమ్మద్ ఫైజాన్ 99.52 – ఎం. వెంకట కార్తీక్ 99.28 – Y. P. కృష్ణ చైతన్య 98.79 – భరత్ సాయి 98.31 – G. వెంకట జేష్వాంత్ 98.18 – శ్యామ్ 98.10 – మోజిత్ 97.79 – విజయేశ్వర్ 97.68 – ప్రణీత్97.68 – ప్రశాంత్ 97.37 – S భావన 97.30 – నాగ సాయి చరణ్ 97.29 – నితీష్ 96.72 – సిద్ధార్థ 96.43 – ఓబుల రెడ్డి 96.00 – భార్గవివరుసగా గెలుపు సాధించి బీరం విద్యా సంస్థల పేరును రాయలసీమ,ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశం అంతటా మారుమ్రోగేలా చేశారు. ఈ గెలుపును పురస్కరించుకొని బీరం విద్యాసంస్థల అధినేత మరియు కడప జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు అయిన బీరం సుబ్బారెడ్డి . చైర్పర్సన్ సరస్వతమ్మ .మాట్లాడుతూ మా విద్యార్థుల యొక్క గెలుపును మేము ముందుగానే ఊహించడం జరిగిందని ఎందుకంటే బీరం కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ,శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయుల పట్ల మాకున్న విశ్వసనీయత, నమ్మకం అటువంటిదని అన్నారు. మరియు గెలుపు సాధించిన వారు అడ్వాన్స్ లో కూడా ఇంకా మంచి ర్యాంక్స్ సాధించి దేశంలో గొప్ప గొప్ప కళాశాలలో ఐఐటి, ఎన్ఐటి లలో సీట్లు సాధించి విద్యను అభ్యసిస్తారు అన్నారు. వీరే కాకుండా మిగిలిన విద్యార్థులు కూడా మంచి ఫలితాన్ని సాధించడం జరిగిందని వారు ఈ సందర్భంగాతెలియజేశారు. ఈ విజయోత్సవంలో బీరం విద్యాసంస్థల డైరెక్టర్ స్వాతి శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జేఈఈ మెయిన్స్ లో రాయలసీమలోనే అత్యధిక సీట్లు సాధించే ఏకైక కళాశాల బీరం శ్రీధర్ రెడ్డి కళాశాల అని అది బీరం విద్యార్థులకే సాధ్యమన్నారు. భవిష్యత్తులో జేఈఈ అంటే బీరం.బీరం అంటే జేఈఈ అనే పేరుచిరస్థాయిగా నిలిచిపోతుందని వారు విద్యార్థులను ప్రశంసించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శ్వేత. కళాశాల ప్రిన్సిపల్ హేమ్ చందర్ మాట్లాడుతూ జేఈఈ మెయిన్స్ కు ఒక కాలేజీలోనే కాదు పాఠశాల స్థాయి నుండి కూడా విద్యార్థులకు ఐఐటి,యన్ టి పరీక్షలకు బీరం విద్యాసంస్థల్లో ఒక సమగ్రమైన ప్రణాళికతో విద్యార్థుల స్థాయిని బట్టి వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అందువలన విద్యార్థులకు ఇంటర్మీడియట్ జేఈఈ లో సులభతరంగా ర్యాంకులు సాధించడం జరుగుతుందన్నారు. ఐఐటి రంగంలో రాణించిమీగొప్పఆశయాలను,కలలను సార్ధకం చేసుకోవాలని ప్రతి విద్యార్థికి బీరం శ్రీధర్ రెడ్డి పాఠశాల మరియు కళాశాల ఒక అద్భుతమైన వేదిక అనిఅన్నారు.కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొని విజయ ఫలాలను అందుకోవడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!