-పెరిగిన హుండీ ఆదాయం 14,96,073
సిద్ధవటం ఫిబ్రవరి 16 ప్రజాసీమ: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు వేసిన కానుకలు హుండీ లెక్కింపు చేపట్టగా 14, 96,073 రూ ఆదాయం వచ్చిందని ఎండోమెంట్ ఇన్చార్జి ఈవో శ్రీధర్ తెలిపారు సిద్ధవటం మండలంలోని లంకమల అభయారణ్యంలో వెలసిన శ్రీ నిత్య పూజ స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా శుక్ర, శని, ఆది, వారంలో మూడు రోజులు పాటు భక్తులు వేసిన కానుకలు హుండీ లెక్కింపు సోమవారం నిత్య పూజ కోన లో చేపట్టామని అన్ని శాఖల అధికారులు పోలీసుల సహకారంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయని ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాజేంద్రప్రసాద్ సి ఎఫ్ ఓ, కిరణ్ కుమార్ రెడ్డి, ఏఆర్ పోలీసులు, సిద్ధవటం పోలీసులు పాల్గొన్నారు

