ePaper
Monday, April 6, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్వైభవంగా ఛాయదేవి, సంధ్యాదేవి సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి కళ్యాణం 

వైభవంగా ఛాయదేవి, సంధ్యాదేవి సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి కళ్యాణం 

📰 Generate e-Paper Clip

సిద్దవటం, ఫిబ్రవరి 12 ( నేటి పత్రిక ప్రజాసీమ) : మండలం లోని కనుమలోల్లి గ్రామ సమీపాన వెలసిన శ్రీ ఉమాదేవి సమేత నీలకంటేశ్వర స్వామి ఆలయం ఆవరణంలో ఉన్న ఛాయదేవి, సంధ్యాదేవి సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి కళ్యాణం గురువారం వై భవోపేతంగా జరిగింది. సూర్యనారాయణ స్వామి ప్రధం వార్షికోత్సవం సందర్బంగా స్వామి వారికి గణపతి పూజ, కలిశిస్థాపన, కంకణధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, ముత్యాల తలంబ్రాలు, బ్రహ్మ ముళ్ళు వంటి పూజ కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు, చైతన్య శర్మ, నిర్వహించి వేద మంత్రాలతో స్వామి కళ్యాణం నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు సోమా బాబు భక్తులకు తీర్థప్రసాదాలు, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!