రాజంపేట, -(ప్రజా సీమ)
మానవతా సేవా సంస్థ రాజంపేట శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఆంజనేయస్వామి దేవాలయం వద్ద చల్లని మినరల్ మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సంస్థ కార్యదర్శి పూల నరసింహమూర్తి ఈరోజు మంచినీటిని, డాక్టర్ టంగుటూరు రామ్మోహన్ మజ్జిగ దాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు వేణుగోపాల్ నాయుడు, కాకర్ల రాముడు, రామచంద్రయ్య నాయుడు, నందకిషోర్ గౌడ్, లయన్ అబ్దుల్లా, యూపీ రాయుడు, చినేపల్లి చంగయ్య, గంగనపల్లి వెంకటరమణ, తలిశెట్టి రమేష్, పబ్బిశెట్టి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

