ePaper
Saturday, April 4, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్భూమి సరిహద్దు సమస్యను పరిష్కరించిన పుల్లంపేట తాహసిల్దార్ పుల్లారెడ్డి

భూమి సరిహద్దు సమస్యను పరిష్కరించిన పుల్లంపేట తాహసిల్దార్ పుల్లారెడ్డి

📰 Generate e-Paper Clip

పుల్లంపేట-(ప్రజాసీమ)

పుల్లంపేట మండలం రెడ్డిపల్లి రెవెన్యూ విలేజ్ లోని 1172 /2 మరియు సమీపంలో ఉన్న భూ యజమానులు రోడ్డున ఆక్రమించారని సుబ్రహ్మణ్యం అనే రైతు కలెక్టర్ కు పెట్టుకున్న అర్జీ మేరకు గురువారం పుల్లంపేట తాహసిల్దార్ పుల్లారెడ్డి స్వయంగా సదరు సమస్యను పర్యవేక్షించి సర్వే చేయించి సమస్య పరిష్కరించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుడు త పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెడ్డయ్య రెడ్డి సమక్షంలో సర్వే నిర్వహించారు. అయితే ఇందులో ఎటువంటి కబ్జా లేదని రెడ్డయ్య రెడ్డికి సంబంధించిన పొలానికి సంబంధించి హద్దులు వేసుకున్నారని, కేవలం ఫిర్యాదుదారుడు కబ్జా జరిగిందని అనుమానంతో ఫిర్యాదు చేయడంతో తాము సర్వే నిర్వహించామని, ఫిర్యాదుదారుని సమక్షంలోనే సర్వే నిర్వహించి వారికి హద్దులు చూపించామని, కావున భూ సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటారని, ప్రతి రైతుకు న్యాయం చేసేందుకే కృషి చేస్తామని, రెడ్డిపల్లి లో జరిగిన దారి సమస్యపై విరుపక్షాల సమక్షంలోనే సమస్యను పరిష్కరించామని పుల్లంపేట తాహసిల్దార్ పుల్లారెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో రాధ, సర్వేయర్లు, రైతులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!