సిద్ధవటం( ప్రజాసీమ)
పేదల పట్ల అంకితభావంతో పార్టీ స్థాపించి పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎన్టీఆర్ అని రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ డైరెక్టర్ వీరభద్రుడు తెలిపారు మండల కేంద్రమైన సిద్దోటంలో ఆదివారం టిడిపి మండల అధ్యక్షుడు రాజశేఖర్ ఆధ్వర్యంలో 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ డైరెక్టర్ వీరభద్రుడు మాట్లాడుతూ పేద బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాల కుటుంబాలలో చిరస్థాయిగా నిలచిపోయిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన ఆశలతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి పేదల పట్ల అంకిత భావంతో పనిచేస్తున్నారని ఎన్టీఆర్ ఆశయాలతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం ఏర్పాటు చేశారని ప్రతి మహిళా లక్షాధికారి కావాలని రుణాలు అందించి వారి కుటుంబాలకు అండగా నిలబడ్డారని అన్నారు రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ డైరెక్టర్ వీరభద్రుడు, టిడిపి అధ్యక్షులు రాజశేఖర్ క్లస్టర్ ఇంచార్జ్ రాజా నాయుడు ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య, పార్లమెంట్ ఉపాధ్యక్షులు నాగ ముని రెడ్డి, రైతు విభాగపు కన్వీనర్ మల్లు వెంకట సుబ్బారెడ్డి బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కృష్ణ యాదవ్, మాజీ జెడ్పిటిసి సభ్యుడు చలమయ్య, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు శ్రీనివాసులు బూసి కృష్ణారెడ్డి, నాగభూషణం, అయ్యప్ప నాయుడు, శ్రీనివాసులు, గాలి సుబ్బయ్య తదితర మండల టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

