ePaper
Monday, April 6, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్జాతీయస్థాయిలో ర్యాంకులు సాధించిన శ్రీ నలంద విద్యార్థులు

జాతీయస్థాయిలో ర్యాంకులు సాధించిన శ్రీ నలంద విద్యార్థులు

📰 Generate e-Paper Clip

సిద్ధవటం ఫిబ్రవరి 13 (నేటిపత్రిక ప్రజాసీమ): అపెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాక్స్ అండ్ సైన్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఐఐటీ / నీట్ ఒలంపియాడ్ ఫలితాలలో జాతీయస్థాయిలో విజయం సాధించారని పాఠశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వెంకటేష్ తెలియజేశారు. జనవరి 24వ తేదీన జరిగిన రాష్ట్రస్థాయి పోటీ పరీక్షలో శ్రీ నలంద ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని జాతీయ స్థాయిలో విజయం సాధించారు. వీరిలో 2వ తరగతి నుండి ఎన్. యజ్ఞేశ్వర రెడ్డి జాతీయస్థాయిలో,అలాగే 4వ తరగతి నుండి ఎన్. వి. కీర్తి రాష్ట్రస్థాయిలో రెండవ స్థానాన్ని అంతేకాకుండా 3 వ తరగతి నుండి బి. శాన్విక శ్రీ, 6 వ తరగతి నుండి పి ప్రవీణ, 8వ తరగతి నుండి పి. పద్మజ లు ఎంపికయ్యారు. ఈ అవార్డులు సాధించిన 5 మంది విద్యార్థుల కు హైదరాబాద్ లోని భారతీయ విద్యా భవన్ ఆడిటోరియం నందు ఈ నెల 23వ తేదీ అవార్డులు ప్రధానం చేస్తారని అపెక్స్ సంస్థ నిర్వాహకులు తెలిపారని పాఠశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తెలిపారు. అలాగే పాఠశాల కరస్పాండెంట్ బాలుగారి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ జాతీయస్థాయిలో అత్యంత ప్రతిభ కనబరిచి అవార్డులు పొందినందుకు వీరికి అభినందనలు తెలియజేశారు. ఇంతటి ఘన విజయం సాధించుటకు ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారం, విద్యార్థుల నిరంతర శ్రమ ఫలితమే ఈ విజయానికి కారణం అని వారు తెలిపారు. అలాగే మండల విద్యాశాఖ అధికారిని అరుణ గారు మాట్లాడుతూ మున్ముందు రాబోవు రోజులలో మరిన్ని విజయాలు సాధించాలని అందుకు పాఠశాల యాజమాన్యం మీ కొరకు నిరంతరం కృషి చేస్తుందని వారు తెలిపారు.విజయం సాధించిన విద్యార్థులకు, పాఠశాల యాజమాన్యం కు ప్రత్యేక అభినందనలు తెలియజేసారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!