ePaper
Monday, April 6, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఘనంగా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు, పరమాత్మ సేవా ఆశ్రమంలో అన్నదానం,

ఘనంగా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు, పరమాత్మ సేవా ఆశ్రమంలో అన్నదానం,

📰 Generate e-Paper Clip

సిద్ధవటం -(ప్రజా సీమ)

సిద్ధవటం మండలం నేకనాపురం గ్రామ సమీపాన పరమాత్మ సేవ వృద్ధాశ్రమంలో గురువారం ఘనంగా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆశ్రమం వద్ద ఉన్న శ్రీ శ్రీ శ్రీ అన్నపూర్ణేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు పండ్లు స్వీటు పంచి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. తిరుమలరెడ్డి శివారెడ్డి , వారి కుమారుడు హరినేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనదని మంత్రి శివారెడ్డి తెలిపారు. మంత్రి శివారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి  ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆ భగవంతుని ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆ దేవదేవుని కోరుకుంటూ గురువారం మధ్యాహ్నం పరమాత్మ సేవా ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అయినదని వారు తెలిపారు. సిద్ధవటం మండలం తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు శనివారపు మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి  జన్మదిన వేడుకలు సిద్ధవటం మండలంలో జరుపుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని, రాంగోపాల్ రెడ్డి  మరి ఎన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆ కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని, మరి ఎన్నో ఉన్నతమైన పదవులు అందుకోవాలని కోరుకుంటున్నానని వారు తెలియజేశారు. సిద్ధవటం మండలం సింగల్ విండో చైర్మన్ దారపునేని దశరథ రామానాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మరి ఎన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నామని వారు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి గ్రామ సర్పంచ్ ప్రతినిధి తుర్ర ప్రతాప్ నాయుడు, గౌడ్ సంఘం అధ్యక్షులు , మురళి గౌడ్, ఎన్నారై ప్రతాప్ రెడ్డి, అధికార ప్రతినిధి, రామచంద్ర, టిడిపి నాయకులు మహేష్ రాజు, మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!