గురుపౌర్ణమి ప్రత్యేక పూజలు నిర్వహించిన తల్లెం భరత్ కుమార్ రెడ్డి
రైల్వేకడూరు న్యూస్
ఓబులవారిపల్లె మండలం కొత్త మంగంపేట (RR-2) లో వెలసియున్న శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. స్థానిక భక్తులు బాలా మరియు వారి సోదరుల ఆహ్వానం మేరకు రాయలసీమ జోన్ వైసిపి బూత్ కమిటీ అధ్యక్షులు, డి ఆర్ యు సి సి సభ్యులు తల్లం భరత్ కుమార్ రెడ్డి విచ్చేసి స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అలాగే, రైల్వేకోడూరు మండలం బుడుగుండుపల్లి పంచాయతీలోని షిరిడీ సాయిబాబా దేవాలయంలో అదునుకోట నరసింహస్వామి ఆహ్వానం మేరకు స్వామివారికి క్షీరాభిషేకం (పాలాభిషేకం) నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రైల్వే కోడూరు మండలంలోని గొల్లపూడి వెంకయ్య స్వామి గుడిలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం రాయలచెరువు సమీపంలో ఉన్న శ్రీ శక్తి పీఠాన్ని దర్శించారు. అక్కడ వెలసియున్న శ్రీ వారాహి అమ్మవారు, పరమశివుడు, కాళికాదేవి మరియు కాలభైరవ స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి, అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు.
ఈ కార్యక్రమాల్లో మంగంపేట యూత్ కమిటీ అధ్యక్షుడు వెంకటేష్, గంగాధర్ రెడ్డి, శ్రీను, రమణ, సునీల్, బాలా, వెంకటసుబ్బయ్య, వెంకటరమణ పాల్గొన్నారు.

