ePaper
Saturday, May 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్గాలివీడు మండలంలో తెలుగుదేశం పార్టీకి కొత్త ఊపు తీసుకొస్తాం – కసిరెడ్డి వెంకట శివారెడ్డి

గాలివీడు మండలంలో తెలుగుదేశం పార్టీకి కొత్త ఊపు తీసుకొస్తాం – కసిరెడ్డి వెంకట శివారెడ్డి

📰 Generate e-Paper Clip

గాలివీడు ఫిబ్రవరి 13(నేటి పత్రిక ప్రజా సీమ విలేకరి): గాలివీడు మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కసిరెడ్డి వెంకట శివారెడ్డి నియమితులయ్యారు.ఈ సందర్బంగా కసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని గౌరవంగా స్వీకరిస్తున్నానని తెలిపారు.తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు దూరదృష్టి నాయకత్వం, పార్టీ జాతీయ కార్యదర్శి ఐటీ విద్యా శాఖ మంత్రి ,రాష్ట్ర రవాణా యువజన, క్రీడలు ,శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర టీడీపి అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ లకు కృత్గ్నతలు తెలియజేస్తూ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రేరణతో గాలివీడు మండలంలో పార్టీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.ఇకపై మండలంలో ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యకర్తలే పార్టీ బలం అని పేర్కొంటూ, వారికి గౌరవం, గుర్తింపు కల్పించడం నా మొదటి కర్తవ్యం అన్నారు. యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించి, కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తామని తెలిపారు.కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా పనిచేస్తామని చెప్పారు. ప్రజల సమస్యలపై నిరంతరం దృష్టి పెట్టిన వాటి పరిస్కరణకి కృషి చేస్తూ , గాలివీడు మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో గాలివీడు మండలంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించేలా సమిష్టిగా కృషి చేస్తామని ఆయన తెలిపారు.కార్యకర్తలే మా బలం… ప్రజలే మా దేవుళ్లు అని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!