అమరావతి
*కలెక్టర్ల కాన్ఫరెన్సులో శాంతిభద్రతల అంశంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం.*
*ప్రజల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదన్న సీఎం…..నిబంధనల అమలులో కఠినంగా ఉండాలని సూచన*
*ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…*
• రోడ్డు ప్రమాదా లు తగ్గించేలా పటిష్ట కార్యాచరణ చేపట్టండి.
• ప్రతీ ప్రాణమూ విలువైనదే. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోకుండా చర్యలు తీసుకోండి.
• ప్రమాదాల నివారణకు పోలీసు, రవాణాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి… సమన్వయంతో పని చేయాలి.
• శ్రీకాకుళం లాంటి కొన్ని జిల్లాల్లో చేపడుతున్న ఉత్తమ విధానాలను ఇతర ప్రాంతాల్లోనూ అనుసరించాలి.
• డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కఠినంగానే వ్యవహరించాలి…ఎవరైనా సరే ఉపేక్షించకండి
• బ్రీత్ అనలైజర్లు, స్పీడ్ గన్లు కొనుగోలుకు రూ.44 కోట్లు విడుదల చేస్తాం
• జాతీయ సగటుతో పోలిస్తే రోడ్డు ప్రమాదాల విషయంలో ఏపీ మరింత మెరుగు పడాలి.
• సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్ లాంటి అంశాల నియంత్రణకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలి.
• అనకాపల్లి, పశ్చిమ గోదావరి, విశాఖ, తదితర జిల్లాల్లోని బ్లాక్ స్పాట్లపై దృష్టి పెట్టాలి.
• బ్లాక్ స్పాట్స్ పై ఫోకస్ పెట్టండి ప్రమాదాల నివారణ లో రిజల్ట్ కనిపించాలి
• జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు ప్రతీ బ్లాక్ స్పాట్లను తనిఖీ చేసి అవసరమైన చర్యలు చేపట్టాలి.
• మహిళలపై జరుగుతున్న నేరాల్లో నిందితులకు భయం ఉండేలా కఠినంగా చర్యలు
• మహిళపై నేరాల్లో జీరో టాలరెన్సు…అప్పుడే మార్పు సాధ్యం
• మదనపల్లి తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఎస్పీలు కఠినంగా ఉండండి
• మహిళలపై గృహ హింస కేసుల్లోనూ తగిన చర్యలు తీసుకోండి.

