ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఒంటిమిట్ట కేంద్రంగా నియోజకవర్గ ఏర్పాటుకు వంద శాతం అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఒంటిమిట్ట, సిద్ధవటం, అట్లూరు మండలాలతో పాటు కడప పరిసరాల గ్రామాలతో ఒంటిమిట్ట నియోజకవర్గ ఏర్పాటు చేసేలా కనిపిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. పునర్విభజన ప్రక్రియ మొదలుకాగానే ఈ మేరకు ఒంటిమిట్టకు సంబంధించి కు అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట లో టిటిడి తో పాటు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతోంది. దీనికి తోడు సర్కిల్ స్థాయి పోలీస్ అధికారులు ఇక్కడ ఉండడం, భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రముఖ క్షేత్రంగా ఎదిగే అవకాశం ఉండడం, ఆ మేరకు అన్ని శాఖల అధికారులకు ఇక్కడ ఉండే అవకాశం ఉండడం, ప్రజల రాకపోకలకు సంబంధించి హైవేలో ఉండడం అటు తిరుపతికి కడపకు అనుసంధానమై ఉండడం, రైల్వే స్టేషన్ ను కూడా ప్రజల రవాణాకు అనుకూలంగా ఆధునికరించేందుకు సిద్ధమవుతుండడం తో అటు రైలు, ఇటు రోడ్డు, విమాన ప్రయాణికులకు అణువుగా ఉన్న ఒంటిమిట్టకు నియోజకవర్గ కేంద్రం గా కొత్త రూపం ఇస్తే అన్ని విధాల సముచితంగా ఉంటుందని స్థానికులతో పాటు పలువురు అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఆంధ్ర భద్రాద్రి హోదాలో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఒంటిమిట్టను నియోజకవర్గం కేంద్రంగా చేసే అవకాశాలపై అన్ని వైపుల నుండి మంచి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నా యని సమాచారం.
ఒంటిమిట్ట కేంద్రం గా నియోజకవర్గ ఏర్పాటు కు అవకాశాలు
0
44

