దేశీయ డొమెస్టిక్ విమాన టికెట్ రేట్లపై ఉన్న పరిమితులను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. సామాన్యులకు ధరలు భారంగా మారకూడదనే ఉద్దేశంతో 2025 డిసెంబర్లో విధించిన ధరల నియంత్రణను ప్రస్తుతం కేంద్రం తొలగించింది. రేపటి నుంచి విమాన ఛార్జీల కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో కొంత మేరకు విమాన ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, ధరలను ఇష్టానుసారంగా పెంచొద్దని ఎయిర్‌లైన్స్‌కు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
ఇష్టానుసారంగా ఛార్జీలు పెంచొద్దు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం….
0
19

