ePaper
Friday, October 9, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్భక్తిశ్రద్ధలతో విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు – పండుగ శోభతో కళకళలాడిన మండపాలు 

భక్తిశ్రద్ధలతో విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు – పండుగ శోభతో కళకళలాడిన మండపాలు 

📰 Generate e-Paper Clip

భక్తిశ్రద్ధలతో విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు – పండుగ శోభతో కళకళలాడిన మండపాలు

రైల్వేకోడూరు మేజర్ న్యూస్

రైల్వేకోడూరు నియోజకవర్గ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వినాయక మండపాలను ప్రత్యేకంగా అలంకరించి, వివిధ ఆకృతుల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను భక్తులు ప్రతిష్ఠించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో మండపాలకు చేరుకుని విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గణపతి పూజా కార్యక్రమాలను నిర్వహించి, స్వామివారికి పుష్పాలంకరణ, పత్రి పూజ, నైవేద్యాలను సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. వినాయకుని దర్శించుకునేందుకు చిన్నారులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

పట్టణంలోని ప్రధాన కూడళ్లు, కాలనీలు, గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద భక్తి కార్యక్రమాలు నిర్వహించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సంబంధిత అధికారులు, పోలీసులు తగిన భద్రతా చర్యలు చేపట్టారు.

విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం కలగాలని భక్తులు ఆకాంక్షించారు. అంతేకాకుండా రైల్వే కోడూరు పొట్టి శ్రీరాములు వీధిలో, కొత్త బజార్ , ఇమామ్ సాహెబ్ వీధిలో, ధర్మాపురం, అంకమ్మనగర్ లో ఇలా వివిధ చోట్ల వినాయక మండపాలు ఏర్పాటు చేయడం జరిగినది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!