కల్పిత నాయకుడు అంబేద్కర్ అనే పుస్తకాన్ని రద్దు చేయాలి…
అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసనలు తెలుపుతున్న దళిత నాయకులు
రైల్వేకోడూరు ప్రజాసీమ
మండల కేంద్రమైన ఓబులవారిపల్లి చిన్న వరంపాడు క్రాస్ వద్ద ఉన్న. అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల తో శనివారం సాయంత్రం.నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా అంబేద్కర్ వాది సీనియర్ పాత్రికేయులు డాక్టర్ బి.ఆర్ రమణ మాట్లాడుతూ ప్రపంచ మేధావి భారత రత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై ఓ ప్రబుద్ధుడు. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అంబేద్కర్ కల్పిత నాయకుడనే పుస్తకాన్ని రచించి కొద్ది రోజుల్లో ఆవిష్కరించడంతో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించరాదని రద్దు చేయాలని ప్రభుత్వం ఆ ప్రబుద్ధుడు పైన కఠిన చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో ఖండించారు పలు విమర్శలు చేశారు అంతేకాకుండా. భారతదేశంలో ఉన్న పౌరులంతా కులమతాలకు అతీతంగా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నేటికీ స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తికావస్తున్న ఇప్పటికీ ఎటువంటి మేధావులు ఎటువంటి అగ్రవర్ణాల వారు డాక్టర్ అంబేద్కర్ ను విమర్శించలేదని పుట్టగొడుగుల పుట్టకొచ్చి ఓ నిజాన్ని పదే పదే అబద్ధముగా మార్చడంతో భావితరాల ప్రజలకు ఈ నిజం అబద్ధం ఏమోనని అపోహలు నిలిచిపోతాయని ఉద్దేశంతో ఇలాంటి వారిని ఆదిలోనే ఇలాంటి వ్యాఖ్యలు అంతం చేయాలని కోరుతున్నామన్నారు దేశవ్యాప్తంగా అంబేద్కర్ వాదులు రోడ్డుపై కొచ్చి రాస్తారోకోలు ధర్నాలు చేసి కల్పిత నాయకుడు పుస్తకం రాసిన అమర ప్రసాద్ పై చర్యలు తీసుకోవడం తప్పదని అంబేద్కర్ వాదులు పోలమనేని మల్లికార్జున పాణ్యం చిన్నయ్య గొంజిపల్లి హరి డేగల మహేశ్వర నారాయణ పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు అంతేకాకుండా ఒక నాయకుడిని కొందరు వ్యక్తులు ఉద్దేశి పూర్వకంగా. మాట్లాడితే వారిని అరెస్టు చేసి కేసులు పెడుతున్నారు కానీ ప్రపంచ మేధావి దేశానికి ఎన్నో సేవలు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే అటు దళిత నాయకులు కానీ దళిత ఎమ్మెల్యేలు మంత్రులు రాష్ట్రంలో ఉన్న మేధావులు నాయకులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని కనీసం నోరు కూడా మెదపలేదని విమర్శించారు ఇది కావాలనే కొందరు కుట్రపన్ని అంబేద్కర్ కీర్తిని దిగదార్చడానికే పన్నాగం పొందుతున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో పలువురు దళిత నాయకులు గాజుల శ్రీనివాసులు పోలంనేని చంద్రయ్య అంబారి శ్రీనివాసులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

