రైల్వేకోడూరులో ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా
రైల్వేకోడూరు ప్రజాసీమ
తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో స్థానిక ఇంద్రా బస్టాండ్ నందు మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది అంతేకాకుండా స్థానిక సాయి కృష్ణ థియేటర్ వద్ద నుండి పవన్ కళ్యాణ్ బర్తడే కేకును అభిమానులు ర్యాలీగా టోల్గేట్ వద్దకు తీసుకువచ్చి అక్కడినుండి బస్టాండ్ వరకు ర్యాలీగా తీసుకురావడం జరిగింది ఆ తర్వాత రాష్ట్ర స్థాయి స్థానిక సంస్థల విదివిధానాల కమిటీ మెంబెర్ యనమల భాస్కర్ కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించడం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన నాయకులు కూటమి నాయకులు, కూటమి అభిమానులు కులాలకు మతాలకు అతీతంగా భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది.