ఆగస్టు18 ధర్నాను జయప్రదం చేయండి
రైల్వేకోడూరు మేజర్ న్యూస్
రైల్వే కోడూరు ఉద్యోగ, కార్మిక సమస్యల పరిష్కారానికి ఆగస్టు 18న తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద జరగనున్న “ధర్నాను” కార్యక్రమాన్ని రైల్వేకోడూరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని
ఏఐటీయూసీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దాసరి జయచంద్ర పిలుపునిచ్చారు.శుక్రవారం స్థానిక ఏఐటీయూసీ ఆఫీస్ నందు నియోజకవర్గ అధ్యక్షులు కామ్రేడ్ మాదరాజు గంగాధర్ అధ్యక్షతన జరిగిన ఆఫీస్ బేరర్స్ ముఖ్య సమావేశంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దాసరి జయచంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు.కనీస వేతనం 31,000 చెల్లించాలి,కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులర్ చేయాలి, ఆశ అంగన్వాడి మధ్యాహ్నం భోజన స్కూల్ ఆయా స్కూల్ వాచ్మెన్ స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, సివిల్ సప్లై హమాలీలకు కూలి రేట్లు పెంచుతూ గ్రాడ్యుటీ సౌకర్యం కల్పించాలి, భావన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా పెండింగ్ క్లెయిమ్స్ పరిష్కరించాలి, ముఠా ఆటో తోపుడు బండ్లు కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వం వెనుకకు తీసుకోవాలి ప్రభుత్వరంగా పరిశ్రమలను కాపాడుకోవాలని,
కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఆగస్టు 18న ఉదయం 10 గంటలకు తిరుపతి కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు రైల్వేకోడూరు నియోజకవర్గం నుండి వేలాదిగా కార్మికులు తరలి రావాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో అన్ని అనుబంధ సంఘాల ఆఫీస్ బేరర్స్ సి పుల్లయ్య, టి చైతన్య జి దినేష్, ఎన్ సరోజనమ్మ, పి విష్ణు శివజ్యోతి, ఏఐటియుసి నియోజకవర్గ కౌన్సిల్ నాయకులు పెంచలయ్య ,రమణయ్య పాల్గొన్నారు.