సిడిపిఓ రేణుక ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
రైల్వేకోడూరు న్యూస్
ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు కార్యక్రమం లో భాగంగా రైల్వేకోడూరు మండలం లోని న్యూ కృష్ణా నగర, అంకమ్మ నగర్, ఆంజనేయ నగర్ అంగన్వాడీ కేంద్రాల పరిధిలో 05-08-2026న రైల్వే కోడూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ రేణుక ఆధ్వర్యంలో తల్లి పాల ప్రాముఖ్యతను గురించి, ముర్రు పాలను బిడ్డ పుట్టిన వెంటనే తాపించడం వలన కలిగే ప్రయోజనాలను , తాపించకపోవటం వలన తల్లికి బిడ్డకి కలిగే నష్టాలను విశ్లేషిస్తూ తల్లులకు మరియు వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించటం జరిగినది.
ఈ కార్యక్రమం లో సిడిపిఓ రేణుక అలాగే సూపర్వైజర్స్ నిర్మలా, సుబ్బలక్ష్మి, యశోద మరియు అంగన్వాడీ కర్తలు రాజేశ్వరి, లక్ష్మీ నరసమ్మ మరియు స్థానిక ప్రజలు పాల్గొనటం జరిగినది.