బ్రాహ్మణ సంఘం నూతన అధ్యక్షుడిగా ఓరుగంటి అనిల్ కుమార్
రైల్వేకోడూరు న్యూస్
రైల్వే కోడూరు శంకరమఠం నందు బ్రాహ్మణ సంఘం వార్షికోత్సవం జరిగినది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం బ్రాహ్మణ సంఘం నూతన అధ్యక్షుడిగా ఓరుగంటి అనిల్ కుమార్ శర్మని ఏకగ్రీవంగా ఎన్నుకోబడినది, కోశాధికారిగా దగ్గుబాటి సతీష్, కార్యదర్శిగా కురవి విశ్వనాథ శర్మ నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున బ్రాహ్మణులు పాల్గొనడం జరిగినది. ఈ సందర్భంగా ఓరుగంటి అనిల్ మాట్లాడుతూ పెద్దలను గౌరవించి వారి సలహాలు తీసుకుని, ప్రతి ఒక్కరిని కలుపుకుని, సంఘం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. బ్రాహ్మణుల ఆప్తుడు, శ్రేయోభిలాషి అయిన మా బావ ఆర్ సి సురేష్ బాబు ఆశీస్సులు ఉండాలని పత్రిక ముఖంగా తెలియచేశారు.నూతన కార్యవర్గం బ్రాహ్మణ సంఘ అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి, సాంప్రదాయ, ధార్మిక, సామాజిక కార్యక్రమాల నిర్వహణకు అంకితభావంతో పనిచేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.సంఘ సభ్యులు నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి నాయకత్వంలో సంఘం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.