prajaseema.com
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 5:35 pm Digital Edition : PRAJA SEEMA DESK

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైఎస్సార్సీపీ, జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన లక్ష్యం జగన్ కాదని, కేవలం వైఎస్సార్సీపీ నేతల విమర్శలకే తాను సమాధానం ఇస్తున్నానని స్పష్టం చేశారు. ‘నా జోలికి వస్తే అఫెన్సివ్ గేమ్ ఆడగలను’ అని హెచ్చరిస్తూనే, పార్టీ నేతలను సైతాన్ సైన్యంతో పోల్చారు. విజయమ్మ మాట్లాడవద్దని లేఖ రాసినా కొందరు విమర్శలు చేస్తున్నారని, దానినే తాను ‘మొరగడం కుక్కల నైజం’ అని అన్నానని వివరించారు.