- తిరుపతి మార్చి 4 )ప్రజాసీమ విలేకరి)
శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) ఆసుపత్రికి స్విమ్స్ బాలాజి ఆరోగ్య వరప్రసాదిని పథకానికి తిరుపతి నగరానికి చెందిన యం. కిషోర్ కుమార్ “లలిత్ ఇన్నోవేషన్ ఫుడ్ ప్రై. లిమిటెడ్. అధినేత స్విమ్స్ హాస్పిటల్ పేద రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిగణలోనికి తీసుకొని 3 లక్షలు రూపాయలు విరాళం అందించినట్టు తెలిపారు. దాత తరపున తిరుపతి వాస్తవ్యులు వై. రాఘవేంద్ర చేతుల మీదుగా ఈ విరాళం అందించారు. మూడు చెక్కుల రూపంలో బుధవారం స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయంలో సంచాలకులు, ఉపకులపతి డా॥ ఆర్.వి.కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా విరాళ దాతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసి, ఇచ్చిన విరాళాన్ని పేద రోగుల వైద్య సేవలకు ఉపయోగిస్తామని తెలియజేశారు .