prajaseema.com
Newspaper Banner
Date of Publish : 04 March 2026, 5:54 pm Digital Edition : PRAJA SEEMA DESK

6 న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సరస్వతి పూజ

గాలివీడు,మార్చి4 (ప్రజాసీమ విలేకరి):ఈనెల 6వ తేదీన మండలకేంద్రం పెద్దూరులో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు సరస్వతీ పూజ నిర్వహి స్తున్నట్లు దేవాదాయ శాఖ ఈఓ కొండారెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోని హిందూ ఆలయాల్లో జిల్తా దేవాదాయ ధర్మాదాయ శాఖ జిల్లా అధికారి విశ్వనాథ ఆధ్వర్యంలో పూజలు నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా 10 వ తరగతి పరీక్షలకు సన్నద్ధమౌవుతున్న విద్యార్ధులు ముందస్తుగా అన్ని ఆలయాల్లో సరస్వతీ పూజ నిర్వహించడంతో పదవతరగతి ఉత్తీర్ణత శాతం పెంచేందుకు దోహ దపడతాయన్నారు.ఈ పూజా కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని అమ్మ వారి కృపకు పాత్రులు కాగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.